ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు మహేష్ బాబును శోకసంద్రంలో ముంచాయి. తాజాగా తండ్రి కృష్ణ మరణంతో మహేశ్ కృంగిపోయారు. ఇక షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్న మహేశ్, తండ్రి అంత్యక్రియలు,పెద్దకర్మ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు ముగియడంతో తిరిగి షూటింగ్స్‌లో పాల్గొన్నాడు మహేశ్‌బాబు. ఇంట్లోనే ఉంటే మహేష్ మరింత దు:ఖంలోకి వెళ్తాడని, ఆయన్ని సినిమా షూటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. మహేష్ నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి సమయం దొరికినప్పుడల్లా మహేష్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలోనే బాక్ టూ వర్క్ అంటూ మహేష్ ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.