కేజీఎఫ్ చిత్రంతో యావత్ భారతావని సినీ చరిత్రనే అదరగొట్టిన హీరో యష్పై కుట్రలు జరుగుతున్నాయని ఆతని తల్లి ఆరోపిస్తోంది. వరుస విజయాలతో దూసుకు పోతున్న తన కొడుకు హీరోకావటం ఇష్టంలేని కొంతమంది సినీ పెద్దలు కావాలనే కుట్ర చేసారని సంచలన ఆరోపణలు చేస్తోంది యష్ తల్లి పుష్ప. దక్షిణాది నుంచి అందునా కన్నడ నాట ! ఒక డ్రైవర్ కి కొడుకుగా పుట్టిన యష్ అనూహ్యంగా స్టార్ కావడంతో కొంతమంది తట్టుకోలేక పోతున్నారని,. అందుకే మాపై కుట్ర చేసారని అంటోంది యష్ తల్లి పుష్ప .
అయితే యష్ కుటుంబం గత ఎనిమిదేళ్లుగా .బనశంకరి లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తదుపరి తమ అవసరాల కోసం పలు రకరకాల పనులు ఆ ఇంట్లో చేయించుకున్నారు. ఇందుకు 12 లక్షలకు పైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ మొత్తం తిరిగి చెల్లించాలంటూ ఇంటి యజమానిపై వత్తిడి పెంచడంతో పాటు 2015 నుండి ఇంటి అద్దె కూడా చెల్లించడం మానేసిందట. ఈ ఇంటి అద్దెలే తనకు జీవనాధారం అంటూ ఆ ఇంటి యజమాని కర్ణాటక హైకోర్టు ని ఆశ్రయించాడు . దీంతో హైకోర్టు యష్ కుటుంబానికి నోటీసులు జారీ చేసి, విచారణ ఆరంభించింది. మీ అవసరాల కోసం చేసుకున్న ఏర్పాట్లకు ఇంటి యజమానెందుకు బాధ్యత వహిస్తాడంటూ తల్లి పుష్ప కు చీవాట్లు పెట్టి న జడ్జిగారు రెండు నెలల్లో ఇప్పటి వరకు బకాయి పడిన అద్దె మొత్తం 23 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు ఇంటిని ఖాళీ చేసి, యజమానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
జరిగిన కథ ఇలా ఉంటే ఇంటి యజమాని అద్దె కోసమంటూ కోర్టు కెక్కడానికి కారణం పరిశ్రమలోని కొంతమంది పెద్దలే కారణంగా చూపిస్తూ, మీడియాకెక్కడంపై కన్నడ పరిశ్రమ భగ్గుమంటోంది. వివాదాన్నిపెద్దది చేసి రాజేస్తోంది యష్ తల్లి పుష్ఫేనని, దీనితో తమకేం సంబంధం అని నిలదీస్తున్నారు కన్నడ సినీ పరిశ్రమలోని కొందరు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa