ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రిన్స్ సరసన సరయ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 08:35 PM

సూపర్‌స్టార్ మహేష్ కెరీర్ తొలి నుంచి పలువురు బాలీవుడ్ కథానాయికలు నటించిన సంగతి తెలిసిందే. ప్రీతిజింతా, నమ్రత, బిపాస బసు, లీసా రే, అమృతరావు, అమీషా పటేల్, సోనాలి బింద్రే లాంటి నాయికలు నటించారు. మరోసారి బాలీవుడ్ నుంచి నవనాయికను మన ప్రిన్స్ కోసం బరిలో దించుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ కథానాయిక కత్రిన  మహేష్ నటించే 26వ చిత్రం లో నటించనుందిట. ఇప్పటికే సుకుమార్ - మైత్రి అధినేతలు కత్రినతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే కత్రిన వైపు నుంచి తుదిగా అంగీకారం తెలియాల్సి ఉందింకా. ఇక ఈ సినిమా కథ ఏంటి? అన్నది ఇప్పటివరకూ సస్పెన్స్ గా ఉన్నా భారీ పీరియాడికల్ చిత్రంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ ని వెచ్చిస్తారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని మార్చి- ఏప్రిల్ లో ప్రారంభోత్సవం చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్స్ వివరాలు తెలియాల్సి ఉందింకా. ఇక కత్రిన గత ఏడాది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (సరయ), జీరో వంటి భారీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa