ఒడియా బుల్లి తెర నటిగా విశేష ప్రేక్షక ఆదరణ పొంది, ఇప్పుడిప్పుడే ఒడియా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న నికిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె వయస్సు 30 సంవత్సరాలు. నికిత అసలు పేరు లక్ష్మి ప్రియ బెహెర. శుక్రవారం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన నికిత అదే రోజు రాత్రి అక్కడే టెర్రస్‌పై నుంచి జారిపడటంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. తీవ్రంగా గాయపడిన నికితను ఆమె తల్లిదండ్రులు మొదట ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కటక్‌లోని శ్రీరామచంద్ర భంజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె ఒంటిపై బలమైన గాయాలతోపాటు చిన్నచిన్న గాయాలు సైతం వున్నాయని పోస్ట్ మార్టం నివేదిక స్పష్టంచేయడం పలు అనుమానాలకు తావిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలు టీవీ సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నికిత ఆకస్మిక మృతి ఒడియా బుల్లి తెర రంగంతోపాటు ఓలీవుడ్ చిత్ర పరిశ్రమను సైతం షాక్‌కి గురిచేసింది. అఖి ఖొల్లిబాకు డొరొ లగ్గుచి అనే ఒడియా చిత్రంతో ఓలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన నికిత ఆ తర్వాత గూండా, చోరీ చోరీ మొన్నొ చోరీ వంటి చిత్రాల్లో నటించారు. నటుడు లిపన్ సాహుతో 2 ఏళ్ల కిందట నికితకు వివాహం కాగా వారికి 6 నెలల పాప కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa