ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదీ పీఎం నరేంద్ర మోదీ ఫస్ట్‌లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 12:29 AM

ఎప్పటినుంచో ఊరిస్తున్న ప్రధాని మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ సరితూగుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫస్ట్ లుక్‌లో వివేక్ మోదీ పాత్రకు సరిగ్గా సరిపోయాడని బాలీవుడ్ అంటోంది. దర్శకుడు ఒమంగ్ కుమార్ బి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
మోదీ స్టైల్లో వివేక్ నిల్చున్నాడు. పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో జాతీయ జెండా రెపరెపలాడగా,  ప్రజలు కనిపిస్తున్నారు. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజన్నా బర్నెట్, అర్జున్ మాథూర్, అభానా కుమ్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa