నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "వీరసింహారెడ్డి" సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు రాబోతున్న వీరసింహారెడ్డి నుండి ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ విడుదలై శ్రోతలను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ వీరసింహారెడ్డి సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఎనౌన్స్మెంట్ ను ఈ రోజు ఉదయం 10:36 నిమిషాలకు ఇవ్వబోతున్నారు. మరి, ఆ స్పెషల్ సాంగ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.