పదిహేనేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి, టీనేజ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని, టాలీవుడ్, కోలీవుడ్లలో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ముంబై బ్యూటీ తమన్నా. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' సినిమాతో 2005లో లీడ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆపై హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బాహుబలి, బెంగాల్ టైగర్, ఊపిరి, F 2, సై రా నరసింహారెడ్డి, F 3 ..వంటి సూపర్ హిట్ సినిమాలలో తమన్నా హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో తమన్నా నటించింది. అలానే సీనియర్ హీరోలలో చిరంజీవి, వెంకటేష్ లతో తమన్నా జతకట్టింది.