మాస్ రాజా రవితేజ నిర్మాణ సారధ్యంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం "మట్టి కుస్తీ". తమిళంలో "గట్ట కుస్తీ". తెలుగు, తమిళ భాషలలో గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మట్టికుస్తి ఈ నెల్లోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఈ నెల 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో మట్టికుస్తీ స్ట్రీమింగ్ కు రాబోతుందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందంట. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రవితేజ, విష్ణు విశాల్ తమ సొంత బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.