నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి "వీరసింహారెడ్డి" గా థియేటర్లకు వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరసింహారెడ్డి షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి కి సంబంధించిన బ్యాలన్స్ సాంగ్ షూట్ ఈ రోజు నుండి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. రేపు కూడా ఈ సాంగ్ షూట్ జరగబోతుంది. పోతే, మరికొద్దిసేపట్లోనే మేకర్స్ నుండి వీరసింహారెడ్డి సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ అప్డేట్ రాబోతుంది.