కొంతసేపటి క్రితమే వీరసింహారెడ్డి మేకర్స్ థర్డ్ సింగిల్ 'మా బావ మనోభావాలు' సాంగ్ రిలీజ్ అప్డేట్ ను స్పెషల్ పోస్టర్ తో తెలియచేసారు. ఈ మేరకు మా బావ మనోభావాలు అనే పార్టీ సాంగ్ డిసెంబర్ 24న మధ్యాహ్నం 03:19నిమిషాలకు విడుదల కాబోతుంది. పోస్టర్ ను బట్టి ఇదొక సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ గా ఉండబోతుంది. అలానే థియేటర్లో అభిమానులు ఈ పాటతో రచ్చ చేసేలా కనిపిస్తుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.