లేడీ సూపర్ స్టార్ నయనతార జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "అదుర్స్" సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో తారక్ తో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను రీసెంట్గా జరిగిన కనెక్ట్ తెలుగు ప్రమోషన్స్ లో నయన్ బయటపెట్టింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటే తారక్ లో ఇంతటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా..?అనిపిస్తుంది.
వివరాల్లోకి వెళితే, అదుర్స్ షూటింగ్ సమయంలో, తన షాట్ కి టైం అవ్వడంతో నయన్ టచప్ చేసుకుంటుందంట. అప్పుడు తన వంకే తారక్ తదేకంగా చూస్తూ కనిపించాడట. నయన్ కి డౌట్ వచ్చి ఎందుకలా చూస్తున్నారు? నేను జస్ట్ టచప్ చేసుకుంటున్నా..అంతేగా! ..అని అందంట. అందరూ నన్నే చూస్తారు... నిన్నెవరూ చూడరు.. అలాంటప్పుడు నువ్వు ఇంత మేకప్ వేసుకోవడం వేస్ట్ ...!! అని ఠక్కున తారక్ చెప్పిన సమాధానం విని... నయన్ ఒకింత షాకై... తారక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి తెగ నవ్విందంట.
పోతే, నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినోద్ రాయ్ ముఖ్యపాత్రలు పోషించిన కనెక్ట్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదల కాబోతుంది.