తాను గర్భం దాల్చినట్లు నటి గౌహర్ ఖాన్ వెల్లడించింది. భర్త జైద్ దర్బార్‌తో పాటు తను కూడా తన ఫస్ట్ బేబీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. గౌహర్, జైద్ 2020 డిసెంబర్‌లో పెళ్లిచేసుకున్నారు.ఈ సాహసం మరింత ముందుకు సాహసం సాగుతుంది. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.' అని రాసుకొచ్చారు.
గౌహర్, జైద్ ప్రేమకథ: కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో గౌహర్, జైద్ ఒక కిరాణా దుకాణంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులుగా ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు డేటింగ్ కొనసాగించారు. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట చివరకు డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.