కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "కనెక్ట్". అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రేపు విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా నయన్ కనెక్ట్ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ప్రముఖ యాంకర్ సుమగారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నయన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్, నయన్ కలిసి 'యోగి' సినిమాలో నటించారు. అప్పటి షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎలా ఉండేవాడో తెలిపింది. ప్రభాస్ చాలా స్వీట్... ఒక కిడ్ లాంటి వాడు.. ఇప్పటికీ అలానే ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ... నేను అతనితో పని చేసేటప్పుడు మాత్రం కిడ్ లానే ప్రవర్తించేవాడు. సెట్స్ లో కలియతిరిగే వాడు.. జోక్స్ వేసేవాడు ..అతనితో పని చెయ్యడం చాలా ఫన్ గా ఉంటుంది. ...కానీ ఇప్పుడు అతనొక పెద్ద పాన్ ఇండియా స్టార్.. అతడిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది... అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
![]() |
![]() |