తన యాంకరింగ్ తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ కామెడీ టైమింగ్ కు ప్రతిఒక్కరూ ఫిదా కావాల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో సైతం నటిస్తున్నాడు. తాజాగా ప్రదీప్ కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి అంటూ పేరు, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నవ్య ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని, ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, త్వరలోనే ప్రదీప్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.