టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో డింపుల్ హయతి ఒకరు. డింపుల్ హైదరాబాదీ అమ్మాయినే. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అప్పటి నుంచి కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే వెళుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో చేసిన 'జర్రా జర్రా' ఐటమ్ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. డింపుల్ కి వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఖిలాడి. రవితేజ కు జంటగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఖిలాడి విజయం సాధిస్తే డింపుల్ కి మంచి బ్రేక్ వచ్చేది. కానీ ఖిలాడి డిజాస్టర్ అయ్యింది.ఆమె గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నిలదొక్కుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా ఈ సుందరి లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. గ్రీన్ కలర్ క్రాప్ టాప్ లో డింపుల్ మెరిసిపోతోంది. కోలకళ్లతో కొంటె చూపులు రువ్వుతోంది.
Ravishing @DimpleHayathi#dimplehayathi pic.twitter.com/vAAxguIWOZ
— Tamil Cine Updates (@TCINEUpdate) December 21, 2022