ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన గొప్ప నటుల జాబితాలో భారత్ నుండి షారుఖ్ ఖాన్ కు చోటు దక్కింది. బ్రిటన్ కు చెందిన ప్రముఖ 'ఎంఫైర్' మ్యాగజైన్ ఈ జాబితాను ప్రకటించగా, భారత్ నుండి షారుక్ ఒక్కడికే చోటు దక్కింది. ప్రముఖ హాలీవుడ్ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హ్యాంక్స్, ఆంథోనీ మార్లస్ బ్రాండో వంటి దిగ్గజాల సరసన షారుఖ్ నిలిచాడు. 'జీవితం రోజూ మన ఊపిరిని హరిస్తుంది. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది' అనే డైలాగ్ షారుఖ్ కెరీర్ లోనే ఉత్తమమైనదని అభిప్రాయపడింది. దేవ్ దాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతాహై లాంటి సినిమాల్లో అతడి నటన అమోఘమని ప్రశంసించింది.