టాలీవుడ్ యువనటుడు సత్యదేవ్ "రామ్ సేతు" సినిమాతో బాలీవుడ్ డిబట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 25 న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదలై డీసెంట్ రివ్యూలను అందుకుంది. అక్షయ్ కుమార్, జాక్వేలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ బరుచ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేసారు.
యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన రామ్ సేతు ఈ నెల 23 నుండి అంటే మరో రెండ్రోజుల్లో హిందీ, తెలుగు, తమిళ భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa