నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఆగస్టు 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఐన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు ఆపై డిజిటల్ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా భళా అనిపించుకున్నాడు. తాజాగా బింబిసారుడి బుల్లితెర ఆగమనం జరగబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు జీ 5 ఛానెల్ లో అతి త్వరలోనే బింబిసార మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతుందని తెలుస్తుంది.
![]() |
![]() |