షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న మూవీ "పఠాన్". సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. జాన్ అబ్రహం కీ రోల్ లో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇండియాలోనే తొలిసారిగా విడుదల కాబోతున్న ICE ఫార్మట్ చిత్రంగా రికార్డు సృష్టించబోతుందని తెలుస్తుంది. ఆడియన్స్ కు బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను కలుగజేసేందుకే పఠాన్ ను ICE ఫార్మాట్లో విడుదల చెయ్యడానికి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. టాప్ గన్ మావెరిక్, డాక్టర్ స్ట్రేంజ్, ది బాట్ మాన్ వంటి బిగ్ హాలీవుడ్ చిత్రాలు ఈ ఫార్మట్లోనే విడుదలై, సూపర్ సక్సెస్ అయ్యాయి.
![]() |
![]() |