ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 108 హీరోయిన్ పై బాలయ్యదే ఫైనల్ డెసిషన్..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 06:33 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి 108వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం రీసెంట్గానే జరిగింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా కీరోల్ లో నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తుంది.  ఈ సినిమాలో R. శరత్ కుమార్ గారు కీరోల్ లో నటిస్తున్నారని రీసెంట్గానే అఫీషియల్ అప్డేట్ అందింది.


ఈ సినిమా హీరోయిన్ విషయంపై ఎప్పటినుండో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నటిస్తుందని ప్రచారం జరగ్గా, ఆ వార్తలని సోనాక్షి కొట్టి పారేసింది. ఆపై టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ను మేకర్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేశారని అంటున్నారు. ఐతే, హీరోయిన్ విషయంపై తుది నిర్ణయం బాలయ్యదే అని, అప్పుడే ఈ సినిమా హీరోయిన్ విషయమై అఫీషియల్ అప్డేట్ వస్తుందని టాక్ నడుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com