S కిరణ్ కుమార్ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సినిమా "జాన్ సే". కృతి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జోహార్, తిమ్మరుసు ఫేమ్ అంకిత్, ఐరావతం ఫేమ్ తన్వి జంటగా నటిస్తున్నారు. సచిన్ కమల్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి హీరో అంకిత్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో అంకిత్ లవర్ బాయ్ 'ప్రణయ్' పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కాబోతుంది.