మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న థియేటర్లకు రావడానికి రెడీ అవుతుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, మేకర్స్ రేపు ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ వీరయ్య టైటిల్ సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు.