వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "V 3". పావన గౌడ, ఎస్తేర్ అనిల్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఆముదావనన్ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా వరలక్ష్మి క్యారెక్టర్ కి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ విడుదలైంది. V 3 అంటే వింధ్య - విక్టిమ్ - వర్డిక్ట్. పోతే, ఈ సినిమా జనవరి 6వ తేదీన విడుదల కాబోతుంది. టీం A వెంచర్స్ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు అల్లెన్ సెబాస్టియన్ సంగీతం అందించారు.