దర్శకుడి నుండి నిర్మాతగా మారిన దశరధ్ కథ అందించి నిర్మిస్తున్న తొలిచిత్రం "లవ్ యూ రామ్". ఈ సినిమాకు DY చౌదరి డైరెక్టర్ కాగా, రోహిత్ బహెల్, అపర్ణా జనార్ధనన్ జంటగా నటిస్తున్నారు. కే వేదా సంగీతం అందిస్తున్నారు.రీసెంట్గా విడుదలైన ఈ మూవీ టీజర్ కు ఆడియన్స్ నుండి మాత్రమే కాక సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ టీజర్ యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్నట్టు తెలుస్తుంది. అన్ని రకాల ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది.