తాలా అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. H. వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్ లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ థర్డ్ సింగిల్ గ్యాంగ్స్టా లిరికల్ వీడియోను విడుదల చేసారు. ఘిబ్రాన్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను షాబీర్ సుల్తాన్, ఘిబ్రాన్ ఆలపించారు. షాబీర్ సుల్తాన్, వివేక లిరిక్స్ అందించారు.
పోతే, ఈ సినిమా తెలుగులో "తెగింపు" టైటిల్ తో విడుదల కాబోతుంది. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది.