టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ఐన చిత్రాలలో హిట్ 2 ఒకటి. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నెక్స్ట్ ఔటింగ్ లో స్వయంగా నానినే లీడ్ రోల్ లో నటించబోతున్నారు. ఈ విషయం తెలిసిందే.
తాజా బజ్ ప్రకారం, హిట్ 3 లో ఇద్దరు హీరోలు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకరు సీనియర్ హీరో కాగా మరొకరు యంగ్ హీరో. యంగ్ హీరో నాని అని ఆల్రెడీ కంఫర్మ్ కాగా, హిట్ 3 కీలకపాత్రలో సీనియర్ హీరో వెంకటేష్ గారు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఐతే, హిట్ 3 క్లైమాక్స్ లో వెంకటేష్ ఇంట్రో జరుగుతుందని, హిట్ 4 లో ఆయన హీరోగా నటిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికైతే.. ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే కానీ.. వీటిపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.