మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా "ప్రాజెక్ట్ కే". దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై CH అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాపై వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ప్రాజెక్ట్ కే టీం నుండి బిగ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. అశ్వినీదత్ గారి కుమార్తె, ప్రొడ్యూసర్ స్వప్న దత్ ఈ విషయాన్ని రీసెంట్గా జరిగిన ట్విట్టర్ స్పేస్ లో వెల్లడించడం జరిగింది. ఇంకేముంది.. ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్తంత ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకోవడం మొదలెట్టనున్నారన్న మాట.