పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన చిత్రం "ఖుషి". కోలీవుడ్ నటుడు కం డైరెక్టర్ SJ సూర్య డైరెక్షన్లో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రంగా నిలిచింది. అంతేకాక ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా చోటు సంపాదించుకుంది.
న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ఈ చిత్రం రీ రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ న్యూ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేసారు.
మణిశర్మ సంగీతం అందించగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. AM రత్నం నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, విజయకుమార్, శివాజీ, ఆలీ కీరోల్స్ లో నటించారు.