RRR తదుపరి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 పై పలురకాల ఆసక్తికర వార్తలు ప్రచారంలోకొస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతుందని, ఈ మేరకు త్వరలోనే మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇవ్వబోతున్నారని మొన్నీమధ్య వరకు టాక్ నడవగా, ఇప్పుడు మరొక అమేజింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో తారక్ తో తలపడే స్ట్రాంగ్ విలన్గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారట. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ తారల సందడి పెరిగినట్టే. దీంతో ఈ సినిమాకు ఉత్తరాదిన కూడా చాలా మంచి బజ్ ఏర్పడుతుంది.
ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, యువసుధా ఆర్ట్స్ నిర్మిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa