స్టార్‌హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో జంటగా నటించిన అయలాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అటు కమలహాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా వెల్లడించారు. తాజాగా జాకీతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్ అంటూ రాసుకొచ్చారు రకుల్. అయితే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.