హీరో నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తొలి షో నుండే హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా తొలిరోజునే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కావడం విశేషం.
హీరో నిఖిల్ తాజాగా ట్విట్టర్ లో 'ఆస్క్ నిఖిల్' పేరిట ఆడియెన్స్ తో ఒక చిట్ చాట్ సెషన్ ను నిర్వహించారు. ఇందులో ఒక నెటిజన్ కార్తికేయ 3 ఉంటుందా? అని నిఖిల్ ను ప్రశ్నిస్తాడు. ఖచ్చితంగా ఉంటుంది.. ఈసారి కార్తికేయ 3 మూవీ 3డి లో రాబోతుంది. డైరెక్టర్ చందు మొండేటి ఒక ఆసక్తికర స్టోరీ పాయింట్ తో మీముందుకు వస్తారు.. అని సమాధానం ఇవ్వడంతో.. అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.
చందు మొండేటి డైరెక్షన్లో రూపొందిన ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, కాలభైరవ సంగీతం అందించారు.
![]() |
![]() |