‘బొమ్మరిల్లు’ ఫేం సిద్దార్థ్ కు మధురై ఎయిర్ పోర్టులో మంగళవారం మధ్యాహ్నం అవమానం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఆయన విమానం దిగి వస్తుండగా అడ్డుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.. అకారణంగా హిందీలో దుర్భాషలాడారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. ఈ ఘటనపై సిద్దార్థ్ విమానాశ్రయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 20 నిమిషాలు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనను, తన తల్లిదండ్రులను వేధించారని సిద్దార్థ్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa