మాస్ రాజా రవితేజ నుండి ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ.. రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్ రాజా అభిమానులలో ఫుల్ ఖుషిని నింపుతూ రీసెంట్గానే 'ధమాకా' విడుదలై, బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేస్తుంది. ఈ డిజాస్టర్ ఏడాదిని రవితేజ గ్రాండ్ సక్సెస్ తో ముగించేలా చేసిన ధమాకా సినిమా గత శుక్రవారం విడుదలై హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మూడ్రోజుల్లో 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ధమాకా కీలకమైన సోమవారం టెస్ట్ ను ఫస్ట్ క్లాస్ లో పాసవ్వగా, మంగళవారాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తంగా ఐదు రోజులలో వరల్డ్ వైడ్ గా 49 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు నక్కిన త్రినాధరావు డైరెక్టర్ గా వ్యవహరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. భీమ్స్ సంగీతం అందించారు.