తలపతి విజయ్ తో 'మాస్టర్' సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. డైరెక్టర్ గా సినీ ప్రయాణం మొదలెట్టిన తొలినాళ్లలోనే కార్తీ, విజయ్, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ వంటి స్టార్ హీరోలతో పని చేసే అద్భుతమైన అవకాశాన్ని పొందిన అరుదైన డైరెక్టర్. అలానే ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలను సూపర్, డూపర్ హిట్లుగా మలిచిన ట్యాలెంటెడ్.
ప్రస్తుతం లోకేష్ తలపతి విజయ్ తో రెండోసారి జట్టు కట్టబోతున్న విషయం తెలిసిందే కదా. తాజా అధికారిక సమాచారం మేరకు ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ - విజయ్ సినిమాలో తాను నటిస్తున్నానని స్వయంగా గౌతమ్ మీడియాకు తెలపడం విశేషం.
భారీ బడ్జెట్టుతో భారీ అంచనాల నడుమ తెరకెక్కనున్న ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.