నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన "ధమాకా" బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. గత శుక్రవారం ధియేటర్లకొచ్చిన ధమాకా మూడ్రోజుల్లో 32 కోట్లు, ఐదురోజుల్లో 49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసి, మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరొకసారి రుజువు చేస్తుంది. ఓవర్సీస్ లో కూడా ధమాకా కలెక్షన్లు ఊరమాస్ రచ్చ చేస్తున్నాయి. ఐదు రోజుల్లో 333కే డాలర్స్ ను వసూలు చేసింది. ప్రేక్షకాభిమానుల కోరిక మేరకు ధమాకా ధియేటర్స్ ను ఓవర్సీస్ లో పెంచడం జరిగిందని తాజాగా తెలుస్తుంది. మరి, ఈ సినిమా అక్కడ మేజర్ 1 మిలియన్ మార్క్ ను అందుకోగలదో లేదో చూడాలి.