ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క పారితోష‌కం కోటిన్న‌ర‌?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 01:55 AM

అనుష్క హీరోయిన్ గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఊక సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మాధవన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు రైటర్ కోనా వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తాజా సమాచారం మేరకు అనుస్క ఈ సినిమా కోసం కోటి యాభై లక్షలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో భారీగా పారితోషకంతీసుకుంటున్న హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. భాగమతి సినిమా తరువాత అనుస్క చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.
ఈ చిత్రంలో అనుష్క ఒక ఎన్.ఆర్.ఐ గా కనిపించనుంది. భారీ తారాగణం నటించబోతున్న ఈ సినిమాకు సైలెంట్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డిఫరెంట్ కన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa