నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి ' గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
వచ్చే నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో వీరసింహారెడ్డి జోరు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు USA లో వీరసింహారెడ్డి 127 షోలకు గానూ 2380 టికెట్లు అమ్ముడయ్యాయి. సంక్రాంతి రిలీజ్ మూవీస్ USA ప్రీ సేల్స్ లో వీరసింహారెడ్డి ఒకడుగు ముందున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa