క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన విభిన్నమైన ప్రేమకథతో డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ 18 పేజెస్ సినిమాను రూపొందించారు. గత శుక్రవారం థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లు ఈ సినిమా పేరుపై నమోదవుతున్నాయి. తొలి రోజే బ్రేక్ ఈవెన్ ఐన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 20 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అలానే, సెకండ్ వీక్ లో కూడా 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతూ, ఆడియన్స్ ను అలరిస్తుంది.
బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 తదుపరి హీరో నిఖిల్ సిద్దార్ధ, అనుపమ జంటగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించగా, గోపీసుందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa