గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా ఆ ఆ
జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారూ
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నాననీ ఆట పట్టించకూ
చేరుకున్నాననీ నన్ను దోచేయకూ
చుట్టుకుంటాను సుడిగాలిలా
హొయ్ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా హోయ్ హొయ్
కొండనాగూ తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందమూ ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ
దూరముంటానులే దగ్గరయ్యేందుకూ
దాచిపెడతానూ నా సర్వమూ
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై