మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్లో రూపొందుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య". మాస్ రాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గురించి తెలిపారు. అదేంటంటే, అప్పటివరకు లుంగీ కట్టుకుని సరదాగా కనిపించే వీరయ్య ఒక్కసారిగా స్టైలిష్ గా మారిపోయి తుపాకులతో విజృంభించే విధానం ఆకట్టుకుంటుందని తెలిపారు. అలానే చిరు, శృతిల మధ్య ఓ సరదా ఫైట్ ను కంపోజ్ చేసారని కూడా పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతుంది.