నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి". గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ రోజు రాత్రి 07:55 నిమిషాలకు ఈ సినిమా నుండి మాస్ మొగుడు లిరికల్ సాంగ్ విడుదల కావాల్సి ఉండగా, మేకర్స్ ఈ పాట విడుదలను వాయిదా వేసి, ట్రైలర్ రిలీజ్ అప్డేట్ మరియు లాంచింగ్ ఈవెంట్ డీటెయిల్స్ కోసం ఆడియన్స్ ను వెయిట్ చెయ్యమని కోరుతూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఒంగోలులో జనవరి 6వ తేదీన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతుందని జరుగుతున్న ప్రచారంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.