మెగాస్టార్ చిరంజీవి గారి న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య". కేఎస్ రవీంద్ర అకా బాబీ కొల్లి డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదలై ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.
తాజాగా వాల్తేరు వీరయ్య సెన్సార్ కంప్లీట్ చేసుకుందని అధికారికంగా తెలుస్తుంది. CBFC నుండి యూ/ ఏ సర్టిఫికెట్ తీసుకుని సంక్రాంతికి రఫ్ఫాడించేందుకు వాల్తేరు వీరయ్య రెడీ అయ్యాడని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.
శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.