మాస్ రాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "ధమాకా". క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. తొలి షో నుండి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా పదిరోజులలో 89కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.
ఇక, ఓవర్సీస్ లో కూడా ధమాకా మంచి వసూళ్లనే రాబడుతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో ధమాకా రవితేజ కెరీర్ లో హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా నిలవడం విశేషం. అక్కడ ధమాకా 555కే డాలర్స్ కు పైగా వసూళ్లను రాబట్టింది.
నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.