యంగ్ హీరో సందీప్ కిషన్, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్న సినిమా "మైఖేల్". రంజిత్ జయకొడి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీరోల్ లో నటిస్తున్నారు. యంగ్ హీరో వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయా భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సందీప్ కిషన్ నుండి రాబోతున్న ఈ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తాజాగా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఫిబ్రవరి 3వ తేదీన మైఖేల్ మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది.
సామ్ CS సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నారు.