కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'చోరుడు/ కల్వన్' అధికారిక ప్రకటన నిన్న జరగ్గా, ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల కావడానికి రెడీ అవుతుంది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, చోరుడు/ కల్వన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చెయ్యనున్నారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సినిమాను యాక్సెస్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, జి ఢిల్లీ బాబు సమర్పిస్తున్నారు.