ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 పేజెస్ : మూడోవారంలో కూడా మాస్సివ్ స్క్రీన్ కౌంట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 12:48 PM

యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన క్రేజీ లవ్ స్టోరీ "18 పేజెస్". డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ డే నే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి, ఆపై నుండి నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న ఈ సినిమా విడుదలై ఈ రోజుతో రెండువారాలు పూర్తయ్యాయి. మూడోవారంలో కూడా ఈ మూవీ 500 + థియేటర్లలో ప్రదర్శన కాబోతుండడం విశేషం.


పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్నప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com