నేచురల్ స్టార్ నాని, మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్నమూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదలైంది. ఇక సంక్రాంతి శుభాకాంక్షలతో కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో నాని క్రికెటర్‌గా అదరగొట్టాడు. ఈ సినిమా నానికి మరో మంచి హిట్ అందించడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో చాలా శిక్షణ తీసుకున్నాడని అన్నారు . నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుండగా, చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa