ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య తదుపరి సినిమాపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 06:25 PM

తమిళ స్టార్ హీరో సూర్య తన 42వ చిత్రాన్ని సిరుత్తై శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. స్టూడియో గ్రీన్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ హీరో మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీతో తన 43వ చిత్రాన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో, జల్లికట్టు దర్శకుడు సూర్యకి కథని వివరించినట్లు పేర్కొన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదని దర్శకుడు తెలిపారు. సూర్య తన 42వ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత, వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ మూవీ కోసం తన డేట్లను ఇచ్చినట్లు సమచారం. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో వేచి చుడాలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa