పల్లవి:
సూటిగా చూడకు.. సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు
సొగసే సెగలే పెడితే
చెదరదా కునుకు
చరణం : 1
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో మారిందంటా
బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా
॥సూటిగా
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే
చరణం 2:
గంటలో మొదలైంది కాదు ఈ భావన
గతజన్మలో కదిలించో ఏమో మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటో
ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో
నీలో ఈ ఆనే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి.
॥సూటిగా