RX 100 ఘనవిజయంతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి ఆపై 'మహాసముద్రం' సినిమా తెరకెక్కించి, భారీ పరాజయాన్ని అందుకున్నారు.
తాజాగా అజయ్ భూపతి తన నెక్స్ట్ బిగ్ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. అజయ్ భూపతి సొంత ప్రొడక్షన్ హౌస్ 'A క్రియేటివ్ వర్క్స్' లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందుతున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్ తో కలిసి అజయ్ భూపతి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ టైటిల్ మరియు హీరో, హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన ఇతర అప్డేట్స్ ను అతి త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.